Brisbane: బ్రిస్బేన్‌లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ (Brisbane)లో టీడీపీ ఎన్నారై విభాగం, స్థానిక తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ (NTR) సినీ వజ్రోత్సవాలు, మినీ మహానాడు(Mini Mahanadu), చంద్రబాబు (Chandrababu) 75వ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించాలి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కేకు కోసం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గొప్పతనాన్ని, తెలుగుజాతికి ఆయన చేసిన సేవల్ని వక్తలు గుర్తుచేసుకున్నారు. దేశచరిత్రలో ఎన్టీఆర్‌ది ఓ ప్రత్యేక అధ్యాయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna), సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Chandramohan Reddy) , టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీ జనార్ధన్, సినీనటుడు నారా రోహిత్, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.







