US Embassy : వారికి తమ దేశంలోకి ప్రవేశించే హక్కు లేదు
భారతీయ విద్యార్థి పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. న్యూయార్క్ ఎయిర్పోర్ట్ (New York Airport)లో విమానం దిగిన అతడ్ని సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. నేలకేసి నొక్కిపెట్టి హింసించారు. ఈ ఘటనను భారతీయులు (Indians) తీవ్రంగా ఖండిరచారు. ఈ ఘటన నేపథ్యంలో భారత్లోని యూఎస్ రాయబార కార్యాలయం (US Embassy) తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధమైన ప్రయాణికులకు అమెరికా (America) స్వాగతిస్తూనే ఉంటుందని పేర్కొంది. అయితే, చట్టవిరుద్ధమైన వారికి తమ దేశంలోకి ప్రవేశించే హక్కు లేదని పేర్కొంది. అక్రమ ప్రవేశం, వీసా (Visa )ల దుర్వినియోగం, యూఎస్ చట్టాలను ఉల్లంఘించడాన్ని మేము సహించము. వారిని మా దేశంలోకి అనుమతించబోము అని భారత్లోని యూఎస్ ఎంబసీ పేర్కొంది.







