Bejing: వైరస్ ల ఫ్యాక్టరీగా చైనా.. మరో మహమ్మారి బయలుదేరింది..

చైనా పేరు చెబితేనే ఇప్పుడు ప్రపంచం వణుకుతోంది. చైనా తుమ్మితే.. ప్రపంచం ముక్కుకు మాస్క్ అడ్డుపెట్టుకుంటోంది. ఎందుకంటే.. చైనా ఇప్పుడు వైరస్ లకు అడ్డాగా మారింది. ఎక్కడ ఏ వైరస్ వచ్చినా.. దాని మూలాలు మాత్రం చైనాలోనే ఉంటున్నాయి. లేటెస్టుగా మరో కొత్తవైరస్ ను చైనాలో కనుగొన్నారు. ఈవార్తలు ప్రపంచాన్ని మరోసారి భయపెడుతున్నాయి.
చైనాలో కొత్త కరోనా వైరస్, HKU5-CoV-2 కలకలం రేపుతోంది. గబ్బిలాలలో ఉండే ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాపించే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు దీనిని కోవిడ్-19 కి దగ్గరగా ఉన్న వైరస్ గా పేర్కొన్నారు, అయితే అంత తీవ్రమైనది కాదని చెప్పారు. ఈ పరిశోధన హాంకాంగ్‌లోని శాస్త్రవేత్తల బృందం చేపట్టింది, ఈ కొత్త వైరస్ మానవ ఆరోగ్యానికి ముప్పును సూచిస్తుంది.
కరోనా వైరస్ మానవాళిని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందితే.. కొన్ని కోట్ల మంది జీవనోపాది కోల్పోయి రోడ్డున పడ్డారు. అలాంటి ఓ విపత్తు మళ్లీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. చైనాలో కరోనా వైరస్‌ను పోలిన మరో వైరస్‌ను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీని పేరు HKU5-CoV-2. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ప్రమాదం ఉన్నట్లు భావిస్తున్నారు. కోవిడ్-19కి కారణమైన SARS-CoV2ని పోలీ ఉన్నట్లు గుర్తించారు. ఈ వైరస్‌కు సంబంధించిన విషయాలను హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే పత్రిక తెలిపింది. గబ్బిలాల్లో కరోనా వైరస్‌పై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ వైరాలజిస్ట్ షీ ఝెంగ్‌లీ ఈ పరిశోధనా బృందానికి నాయకత్వం వహించారు.
ఈ పరిశోధనలో గ్వాంగ్‌జౌ లాబొరేటరీ, గ్వాంగ్‌జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ యూనివర్సిటీ, వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైంటిస్టులు పాల్గొన్నారు. వారి పరిశోధనలు పీర్ రివ్యూడ్ జర్నల్ సెల్‌లో ప్రచురించారు. కొత్తగా కనిపెట్టిన ఈ వైరస్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(MERS) వైరస్‌ను కలిగి ఉండే మెర్బెకోవైరస్ ఉపజాతికి చెందింది. ఇది హాంకాంగ్‌లోని జపనీస్ పిపిస్ట్రెల్ గబ్బిలాల్లో మొదటిగా గుర్తించిన హెచ్‌కేయూ5 కరోనో వైరస్ కొత్త రూపం. ఇది నేరుగా లేదా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు.అయితే కరోనా అంత తీవ్రమైన ప్రభావం చూపలేదని చెబుతున్నారు . అయితే మరో వైరస్ వస్తోందన్న అధ్యయనం రిపోర్ట్.. ప్రపంచానికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.