Wealth Summit 2025: సంజీవ్ గుప్తా ఆధ్వర్యంలో న్యూయార్క్లో “వెల్త్ సమ్మిట్ 2025”
ధనవంతులు తమ సంపదను మరింత పెంచుకోవడానికి, పన్నులను చట్టబద్ధంగా ఆదా చేసుకోవడానికి ఆర్థిక మెళకువలు తెలిపేందుకు నవంబర్ 16న “వెల్త్ సమ్మిట్ 2025” (Wealth Summit 2025) జరగనుంది. కాలిఫోర్నియాలోని నెవార్క్లో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (CPA) సంజీవ్ గుప్తా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పన్ను ఆదా వ్యూహాలు, డబ్ల్యూ-2, 1099 ప్లానింగ్, అధిక నికర విలువ కలిగిన వారి కోసం వ్యూహాలు, చిన్న వ్యాపార పన్నులు, సైడ్ హస్టిల్స్, క్యాపిటల్ గెయిన్ పరిష్కారాలు, ఎస్టేట్ ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానింగ్, మరియు రియల్ ఎస్టేట్ పన్ను ప్రణాళిక వంటి అనేక ముఖ్యమైన అంశాలపై లోతైన అవగాహన కల్పించనున్నారు.
ఈ ఒక్క రోజు (Wealth Summit 2025) కార్యక్రమంలో పాల్గొంటే ముఖ్యంగా రాబోయే పన్ను మార్పుల నేపథ్యంలో, తమ ఆర్థిక భవిష్యత్తును పటిష్టం చేసుకోవడానికి అవసరమైన చిట్కాలను నేర్చుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ సమ్మిట్లో లంచ్/స్నాక్స్ సహా అనేక బహుమతులు కూడా అందించే అవకాశం ఉంది.







