NV Ramana: ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు …నా కుటుంబాన్ని
విట్ యూనివర్సిటీ కాన్వకేషన్లో సుప్రీంకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (NV Ramana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి (Amaravati) నగరం రైతుల కష్టం, వారి త్యాగంపై నిర్మింపబడుతోందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత అతి సుదీర్ఘంగా రాజధాని అమరావతి కోసం ఇక్కడి రైతులు పోరాటం చేశారని తెలిపారు. న్యాయవ్యవస్థపై రైతులు నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి క్రిమినల్ కేసులు (Criminal cases) పెట్టారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏ దేశం చూసినా ఏమున్నది గర్వకారణం అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పిన కవిత్వాన్ని ఆయన ప్రస్తావించారు. కృష్ణా నది (Krishna River) నాగరికతలో సామాన్య జీవితం ఎవ్వరిది, అమరావతి నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అంటూ శ్రీశ్రీ కవిత్వాన్ని తనదైన శైలిలో అన్వయించారు. నాటి నిర్ణయాల వల్ల అమరావతి అనేక కష్టాలకు గురైందని తెలిపారు. కష్టకాలంలో విట్ లాంటి యూనివర్సిటీ నిలబడిందన్నారు. చుట్టప్రక్కల గ్రామాల ప్రజల స్కూలింగ్కు, ఆసుపత్రులకు విట్ సహకరిస్తుందని చెప్పారు. ఈ ప్రాంతం మొత్తం తనకు తెలుసని, అప్పట్లో ఎమర్జన్సీ సమయంలో కృష్ణానదిలో ఉన్న దిబ్బలపై రహస్య సమావేశాలు పెట్టుకున్నామంటూ ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు.







