London: లండన్‌కు సీఎం చంద్రబాబు దంపతులు
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) , సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari) తో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేడు లండన్(London) వెళుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎంపీగా ఉన్న భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) సంస్థ 2025 సంవత్సరానికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ను నవంబర్ 4న లండన్‌లో ప్రదానం చేయనుంది. హెరిటేజ్ ఫుడ్స్‌కు ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు (Golden Peacock Award) నూ ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై భువనేశ్వరి అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ, సామాజిక సాధికారతకు పాటుపడుతున్నందుకు భువనేశ్వరిన విశిష్ట వ్యక్తిగా గుర్తిస్తూ ఐఓడీ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందిస్తోంది. ఈ కార్యక్రమం లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్‌లో జరుగుతుది. వ్యక్తిగత పర్యటన తర్వాత చంద్రబాబు లండన్ పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో భేటీ అవుతారు. విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. నవంబరు 6న చంద్రబాబు తిరిగి అమరావతికి చేరుకుంటారు.







