Kashibugga: రెయిలింగ్ ఉడటంతో ప్రమాదం : హోంమంత్రి అనిత
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ (Kashibugga)లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత (Home Minister Anita) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ (SP) , పోలీసు (Police) ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. ఈ ఆలయానికి ప్రతి వారం 1500 నుంచి 2 వేల మంది భక్తులు దర్శనం కోసం వస్తారని తెలిపారు. ఆలయం మొదటి అంతస్తులో ఉంటుందని, 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రెయిలింగ్ ఊడిపడిరదని వివరించారు. దీంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మహిళ భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు ప్రాణపాయం లేదని తెలుస్తోందన్నారు.







