ATA: భారత్లో డిసెంబర్ 12 నుంచి 27 వరకు ఆటా వేడుకలు
అమెరికన్ తెలుగు సంఘం (ATA) వేడుకలు భారత్ వేదికగా డిసెంబర్ 12 నుండి 27 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆటా (ATA) ప్రకటించింది. “సంప్రదాయాలకు వంతెన, సేవలో సత్తా, వ్యాపారంలో రాణింపు, విద్యలో సాధికారత” అనే నినాదంతో తెలుగు సంస్కృతి, సేవ, వ్యాపారం, విద్యను ప్రోత్సహించడమే ఈ వేడుకల ప్రధాన లక్ష్యం అని ఆటా తెలిపింది. ఈ కార్యక్రమానికి వివిధ స్థాయిలలో స్పాన్సర్షిప్ అవకాశాలు కల్పిస్తున్నారు. డైమండ్ స్పాన్సర్ (రూ. 5 లక్షలు / $6,250), ప్లాటినం స్పాన్సర్ (రూ. 2 లక్షలు / $2,500), గోల్డ్ స్పాన్సర్ (రూ. 1 లక్ష / $1,250)లు చెల్లించి ఈ వేడుకల్లో బాగం కావొచ్చు. స్పాన్సర్లకు వివిధ ప్రచార ప్రయోజనాలు, ఆటా (ATA) భారతిలో ప్రకటనలు, సెమినార్లలో గుర్తింపు, ఆటా 19వ కాన్ఫరెన్స్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.
ఆటా (ATA) వేడుకల గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 27న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి మరింత సమాచారం కోసం సతీష్ రెడ్డిని 214-476-4771 నెంబరులో లేదా president-elect@ataworld.org మెయిల్ ద్వారా సంప్రదించవచ్చునని ఆటా (ATA) తెలిపింది.
ఆటా (ATA) కార్యనిర్వాహక కమిటీలో జయంత్ చల్లా (ప్రెసిడెంట్), సతీష్ రామసహాయం రెడ్డి (ప్రెసిడెంట్ ఎలక్ట్), మధు బొమ్మినేని (గత ప్రెసిడెంట్), సాయినాథ్ బొబ్బాపల్లి (సెక్రటరీ), శ్రీకాంత్ గుడిపాటి (ట్రెజరర్), శారదా సింగిరెడ్డి (జాయింట్ సెక్రటరీ), విజయ్ తూపుపల్లి (జాయింట్ ట్రెజరర్), నరసింహారెడ్డి గద్దికొప్పుల (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), అరవింద్ రెడ్డి ముప్పిడి (ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్) తదితరులు ఉన్నారు.







