Pawan Kalyan: ఆలయాల వద్ద భక్తుల రద్దీని క్రమబద్ధీకరించాలి : పవన్ కల్యాణ్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ (Kashibugga) లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం(Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది భక్తులు మృతి (Death) చెందడం దురదృష్టకరమన్నారు. వారిలో చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆధ్మాత్మికంగా విశిష్టమైన రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల (Temples) వద్ద భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేలా, ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని అధికార యంత్రాంగానికి పవన్ విజ్ఞప్తి చేశారు.







