School Life: నవంబర్ 14వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న “స్కూల్ లైఫ్”
నైనిషా క్రియేషన్స్ బ్యానర్‌పై గంగాభవని నిర్మాతగా పులివెందుల మహేష్ రచన దర్శకత్వంలో బాలల దినోత్సవ సందర్భంగా నవంబర్ 14 వ తేదీన దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం స్కూల్ లైఫ్. పులివెందుల మహేష్ హీరోగా నటించగా తనతో జంటగా సావిత్రి, షన్ను నటించారు. హీరో సుమన్, ఆమని, మురళీధర్ గౌడ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రను పోషించారు. ధర్మ జిజి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా నందమూరి హరి, ఎన్టీఆర్(సూపర్ గుడ్ ఫిలిమ్స్) ఈ చిత్రాన్ని ఎడిట్ చేశారు. షేక్ బాజీ ఈ చిత్రానికి సంగీతం అందించగా క్రౌడ్ ఫండింగ్ రూపంలో ఈ చిత్రాన్ని ఆర్థికంగా సమకూర్చారు. విడుదల తేదీ దగ్గర అవుతున్న ఈ సమయంలో దర్శకుడు తన తల్లిదండ్రుల చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. స్కూల్ లైఫ్ అనే సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పటికే ఎన్నో వందల సినిమాలలో నేను నటించినప్పటికీ ఈ సినిమాలోని పాత్ర నా మనసుకు చాలా దగ్గరగా అనిపించింది. ఒక రైతు పాత్రలో రైతులకు అండగా నిలబడేలా నా పాత్ర ఉండబోతుంది. సినిమా షూటింగ్ సమయంలో నాకు ఒక యాక్సిడెంట్ వల్ల కొన్ని రోజులు షూటింగ్ చేయలేకపోయాను. వేరే ఎవరితో అయినా షూటింగ్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ మహేష్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా కేవలం ఆ పాత్రను నేను మాత్రమే చేయాలని పట్టుదలతో నా కోసం వెయిట్ చేసి ఆ పాత్రను నాతో నటించేలా చేశారు. ఆ పాత్ర కోసం నేను పులివెందుల వెళ్లి అక్కడ లొకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రజలను ఎంతగానో అభిమానించారు.
ఈ చిత్రంలో ఆమని గారు నాకు భార్యగా నటించారు. ఈ చిత్ర టైటిల్ విషయానికి వస్తే స్కూల్ లైఫ్. అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే జీవితం అది. ఆ వయసులో ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినా మహేష్ వాటిని ఎదుర్కొని ఈ చిత్ర షూటింగును సవ్యంగా పూర్తి చేశారు. అందుకే అతను పబ్లిక్ స్టార్ పులివెందుల మహేష్ అయ్యారు. తల్లిదండ్రుల చేతుల మీదగా ఈ చిత్ర టైలర్ లంచ్ చేయడం అనేది ఎంత గొప్ప విషయం. అలాగే ఈ చిత్రానికి ఇతర కాస్ట్, సాంకేతిక నిపుణులు కూడా ఎంతో అద్భుతంగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ చిత్రం ద్వారా ఎంతో మంది కొత్త ఆర్టిస్టులు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. నవంబర్ 14వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.
దర్శకుడు, హీరో పబ్లిక్ స్టార్ పులివెందుల మహేష్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. మా సినిమాను సపోర్ట్ చేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా సినిమాలో కీలకపాత్రలు పోషించి, సినిమాకు ఎంతో సపోర్ట్ చేసిన సుమన్ గారికి, ఆమని గారికి, మురళీధర్ గారు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా కోసం నేను ఎన్నో పోగొట్టుకున్నాను. ఒక సామాన్య ఆర్టిస్టు స్థాయి నుండి ఈరోజు సినిమా చేసే వరకు వచ్చాను. సినిమాలు బ్రతకాలి. అందుకే నేను ఈ సినిమాను మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఎట్టి పరిస్థితులలో నవంబర్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చిన్న సినిమాలను సపోర్ట్ చేయండి. భవిష్యత్తులో కొత్త వారి అందరికీ నా బ్యానర్ సపోర్ట్ గా నిలుస్తుంది. సినిమాలలో హీరో కథ, బడ్జెట్ కాదు. క్రౌడ్ ఫండింగ్ చేసి ఈ సినిమాను పూర్తి చేసాము. ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్న వారంతా ఒకప్పుడు కొత్త వారే. మా సినిమా టికెట్ కేవలం వంద రూపాయలు మాత్రమే ఉండబోతుంది.
హీరోయిన్ షన్ను మాట్లాడుతూ… “మా చిత్ర టైలర్ లాంచ్ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా సినిమాలో అందరూ సపోర్ట్ చేసి నవంబర్ 14వ తేదీన సినిమాలు మొత్తం హిట్టు చేస్తారని మీడియా వారిని అలాగే ప్రేక్షకులను కోరుకుంటున్నాను. ఎంతో కింద నుండి వచ్చి ఈ సినిమాను పూర్తి చేసాము. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మహేష్ గారికి, ఈ సినిమాలో నటించిన సుమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ చిత్రం కోసం పనిచేసిన ఇతర నటీనటులకు, సాంకేత నిపుణులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రంలో నాది మూడు నిమిషాల ఒకటే డైలాగ్ ఉంటుంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను” అంటూ ముగించారు.
హీరోయిన్ సావిత్రి మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. స్కూల్ లైఫ్ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన వారందరికీ మా ధన్యవాదాలు. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మహేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నవంబర్ 14 తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరూ చూసి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.







