Kadiyam Srihari: స్టేషన్ ఘన్ పూర్ వస్తే నేనేంటో తెలుస్తుంది : కడియం శ్రీహరి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు బలుపు, అహంభావం ఎక్కువని, ఆయన మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ కేటీఆర్ (KTR) మీ నాయన పదేళ్లు సీఎంగా చేస్తే, నేను 14ఏళ్లు మంత్రిగా పని చేశా. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను, పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిపి కేటీఆర్ వీళ్లు ఆడా, మగా అంటూ దిగజారి మాట్లాడారని గుర్తు చేశారు. కేసీఆర్ కంటే వయస్సులో తామిద్దరం రెండేళ్లు పెద్ద అని చెప్పిన కడియం, నేను ఆడో, మగో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి వచ్చి చూడు బిడ్డా, 143 సర్పంచ్‌లకు వంద సర్పంచ్‌లను గెలిపించుకున్నాం అని వ్యాఖ్యానించారు.
సీఎంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) బాధ్యతలు చేపట్టాక, తమ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్న ఆయన ఆహ్వానం మేరకే కాంగ్రెస్ (Congress) తో కలిసి పనిచేస్తున్నానని కడియంచెప్పారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నందునే నియోజకవర్గానికి రూ.1400కోట్ల నిధులు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో 36మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, అందులో ఏ ఒక్కరైనా అనర్హతకు గురయ్యారా అని ప్రశ్నించారు.






