Peddi: నెక్ట్స్ షెడ్యూల్ కు రెడీ అవుతున్న పెద్ది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan) ఎన్నో అంచనాలతో, ఎంతో కష్టపడి చేసిన గేమ్ ఛేంజర్(game changer) సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. గేమ్ ఛేంజర్ ఫలితం చరణ్ ను, అతని ఫ్యాన్స్ ను ఎంతో నిరాశ పరిచింది. ప్రస్తుతం ఉప్పెన(uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో పెద్ది(peddi) అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు చరణ్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేసుకున్న పెద్ది, ఇప్పుడు మరో షెడ్యూల్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 4 నుంచ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ(RFC)లో మొదలవనుందని, ఈ షెడ్యూల్ షూటింగ్ లో చరణ్ చాలా కొత్త లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.
అంతే కాదు, మరో రెండు వారాల్లో పెద్దికి సంబంధించిన రెండు సరికొత్త అప్డేట్స్ రానున్నాయని, ఆ అప్డేట్స్ కచ్ఛితంగా ఆడియన్స్ తో పాటూ సోషల్ మీడియాను కూడా ఉర్రూతలూగించడం ఖాయమని చిత్ర యూనిట్ వర్గాలంటున్నాయి. నెక్ట్స్ ఇయర్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ కానున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తుండగా, జాన్వీ కపూర్(Janhvi kapoor) పెద్ది లో హీరోయిన్ గా నటిస్తోంది.







