Netanyahu: నెతన్యాహు సంచలన ప్రకటన… గాజా మొత్తాన్ని
గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ప్రకటించారు. గిడియన్ చారియట్స్ (Gideon Chariots) పేరుతో ఇజ్రాయెల్ (Israel) సైన్యం గాజావ్యాప్తంగా భూతలదాడులు ప్రారంభించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మా పోరాటం తీవ్రస్థాయిలో ఉంది. పురోగతి సాధిస్తున్నాం. ఆ ప్రాంతం మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటాం. ఇందులో వెనక్కి తగ్గేదేలేదు అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు గాజా (Gaza) లోకి పరిమిత మానవతా సాయం ప్రవేశించేందుకు నెతన్యాహు అనుమతించారు. గాజాలోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్యూనిస్, సమీప ప్రాంతాలను ఖాళీ చేయాలని స్థానిక ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలు జారీ చేసింది.







