Netanyahu: అలా చేస్తే మీకే చేటు : నెతన్యాహూ
                                    కాల్పుల విరమణకు, ద్విదేశ సిద్ధాంతానికి అంగీకరించకపోతే సెప్టెంబరులో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ సమావేశంలో పాలస్తీనాను ప్రత్యేకంగా దేశంగా గుర్తిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ (Netanyahu) తీవ్రంగా ఖండిరచారు. హమాస్ ఉగ్ర కార్యకలాపాలకు కీర్ స్టార్మర్ (Keir Starmer) పరోక్షంగా మద్దతిస్తున్నారని మండిపడ్డారు. తద్వారా హమాస్ బాధితులును శిక్షిస్తున్నట్లు అవుతోందని పేర్కొన్నారు. మా సరిహద్దులోని ఈ ప్రాంతాన్ని దేశంగా గుర్తిస్తే అది భవిష్యత్తులో బ్రిటన్ (Britain)కూ ముప్పుగా మారుతుంది. ఈ గుర్తింపు విషయంలో బ్రిటన్ ఓ చారిత్రక, నైతిక బాధ్యతను కలిగి ఉంది అని అన్నారు. ఉగ్రవాదుల పట్ల బుజ్జగింపు చర్యలనేవి పనిచేయవని పేర్కొన్నారు. పాలస్తీనా (Palestine) ను ప్రత్యేక దేశంగా గుర్తించాలనే బ్రిటన్, ఫ్రాన్స్ (France) తదితర ఐరోపా దేశాల ప్రణాళికలను బందీల కుటుంబాలు తప్పుబట్టాయి. ఇటువంటి చర్యలు ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తాయని విమర్శించాయి. ఇది శాంతిస్థాపనకు దోహదపడదని, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అవుతుందని పేర్కొన్నారు.







