Balakrishna : సింగపూర్లో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు
తెలుగుదేశం ఫోరమ్ సింగపూర్ ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) పుట్టిన రోజు వేడుకలను సింగపూర్ (Singapore)లో ఘనంగా నిర్వహించారు. సినీ రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా స్టార్ హీరో (Star hero) గా రాణించిన బాలయ్య ఎన్నో హిట్ చిత్రాలు అందించారని అభిమానులు తెలిపారు. బసవతారకం ఆసుపత్రి (Basavatarakam Hospital) నడుపుతూ ఎందరో పేద, మధ్యతరగతి కుటుంబాలకు పునర్జన్మ అందిస్తున్నారని కొనియాడారు. సినీ, రాజకీయ రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేశారని తెలిపారు. ఈ వేడుకలో బాలయ్య అభిమానులు, తెలుగు ప్రజలు పాల్గొన్నారు.







