Virginia: వర్జీనియాలో ఘనంగా మినీ మహానాడు
అమెరికాలోని వర్జీనియా (Virginia)లో మినీ మహానాడు ను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ 102వ జయంతి, సినీ వజ్రోత్సవాల్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ (NTR) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేకు కోసి సంబరాలు చేసుకొన్నారు. విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh ) కు పూర్తిస్థాయిలో టీడీపీ బాధ్యతలు అప్పగించాలని తీర్మానం చేసి ఆమోదించారు. ఎన్టీఆర్పై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరిం చారు. కార్యక్రమానికి గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ( Mannava Subbarao) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఎవరికీ అందరంత ఎత్తుకు ఎదిగారు. తెలుగుజాతి ఉన్నంతవరకూ ఆయన ఉంటారు. టీడీపీ ఒక ప్రయోగశాల, నాయకులు,కార్యకర్తల్ని తాయారు చేసే కార్మాగారం అని సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన భాను మాగులూరి (Bhanu Maguluri)ని సత్కరించారు. మేరీల్యాండ్ టీడీపీ ప్రతినిధి రాజా రావులపల్లి, కిశోర్ కంచెర్ల, రమేశ్ అవిరినేని, చక్రవర్తి, సీతారామారావు, రఘు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.







