Bangladesh: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్న యూనస్
బంగ్లాదేశ్ (Bangladesh) ప్రభుత్వ తాత్కాలిక సారథి ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) పై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బంగ్లా అవావీ లీగ్ పార్టీ (Bangla Awami League Party ) పై నిషేధం విధించడాన్ని తీవ్రంగా ఖండిరచిన ఆమె, అది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఉగ్రవాద సంస్థల సాయంతో యూనస్ పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో బంగ్లాను అమెరికా (America) కు ఆమ్మేసేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ఉగ్రవాద భావజాలమున్న వారి మద్దతతో యూనస్ ప్రభుత్వాన్ని చేపట్టారని షేక్ హసీనా ఆరోపించారు.







