200 ఏళ్ల చరిత్రలో.. ఇదే తొలిసారి
మెక్సికో నూతన అధ్యక్షురాలిగా అధికార మోరెనా పార్టీకి చెదిన క్లాడియా షేన్‌బామ్ భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. 200 ఏళ్ల ఆ దేశ చరిత్రలో ఓ మహిళ అధ్యక్షురాలు కావడం ఇదే తొలిసారి. పర్యావరణ శాస్త్రవేత్తగా పేరొందిన క్లాడియా గతంలో మెక్సికో సిటీ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. దాదాపు 10 కోట్ల మంది మెక్సికో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఈ ఎన్నికల్లో భారీ హింస చెలరేగింది. బరిలో ఉన్న చాలా మంది అభ్యర్థులు హత్యకు గురయ్యారు. అధ్యక్ష ఎన్నికతో పాటు, గవర్నర్, మేయర్ పదవులకు, స్థానిక సంస్థలకూ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత అధ్యక్షుడు అండ్రీస్ మాన్యుయెల్ లోపెజ్ విధానాలనే కొనసాగిస్తానని క్లాడియా తెలిపారు.






