Megha Vemuri : అమెరికాలో మేఘా వేమూరి పై నిషేధం
గాజాలో యుద్ధాన్ని నిరసిస్తూ ప్రసంగించినందుకు ఓ భారతీయ అమెరికన్ విద్యార్థినిని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Massachusetts Institute of Technology) ( ఎంఐటీ) యాజమాన్యం గ్రాడ్యుయేషన్ వేడుక నుంచి బహిష్కరించింది. జార్జియా (Georgia) లో పుట్టి పెరిగిన మేఘా వేమూరి (Megha Vemuri) మే 29న తమ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాలస్తీనాకు మద్దతు తెలిపే ఎర్రని సంప్రదాయబద్ధ చున్నీ ధరించి మాట్లాడారు. ఇజ్రాయెల్ (Israel) తో తమ విశ్వవిద్యాలయానికి ఉన్న పరిశోధన బంధాలను విమర్శించారు. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేషన్ వేడుకకు ఆమె, కుటుంబ సభ్యులు హాజరు కాకుండా యూనివర్సిటీ యాజమాన్యం నిషేధం విధించింది. ఈ -మెయిల్ ద్వారా డిగ్రీ అందజేస్తామని తెలిపింది. భావవ్యక్తీకరణ నిబంధనల్ని ఆమె ఉల్లంఘించినట్లు పేర్కొంది. గాజాలో ఇజ్రాయెల్ చర్యల్ని ఆమె గట్టిగా విమర్శించారు. మేఘా 2021లో ఎంఐటీలో చేరారు. ఇటీవల డిగ్రీ పూర్తిచేశారు.







