అమెరికాలో లారెన్స్ బిష్ణోయ్ సోదరుడి అరెస్టు!
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్టయినట్లు ముంబయి పోలీసులు వర్గాలు వెల్లడిరచాయి. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా పలు కేసుల్లో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు. ఇతడి సూచనల మేరకు ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసినట్లు నిందితులు వెల్లడిరచిన విషయం తెలిసిందే. 2022లో హత్యకు గురైన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా కేసులోనూ అన్మోల్ అనుమానితుడిగా ఉన్నాడు. బాబా సిద్దిఖీ హత్య కేసులో నిందితులతో ఇతడు సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అన్మోల్ను భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ ప్రత్యేక న్యాయ స్థానంలో ముంబయి పోలీసులు ఇటీవల పిటిసన్ వేశారు. లారెన్స్ తరపున అన్మోల్ పలు చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో భాగమయ్యాడని అందులో పేర్కొన్నారు. దీంతో అతడిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఈ క్రమంలోనే అన్మోల్ కదలిక గురించి అమెరికా అధికారులు ముంబయి పోలీసులను అప్రమత్తం చేయగా, తాజాగా కాలిఫోర్నియాలో అతడు అరెస్టు అయినట్లు సమాచారం.






