Gaza: ఇజ్రాయెల్ వర్సెస్ గ్రెటా థన్‌బర్గ్

గాజా (Gaza) లో మానవతాసాయం అందించేందుకు ఓ నౌకలో బయల్దేరి వెళ్తుండగా స్వీడిష్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ (Greta Thunberg) సహా 12 మందిని ఇజ్రాయెలీ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆంక్షలను ఉల్లంఘించి తమ సముద్ర జలాల్లో ప్రవేశించినందుకు గాను .. వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. గ్రెటా, మరో ఇద్దరు కార్యకర్తలు, ఓ జర్నలిస్టు ఇజ్రాయెల్‌ను విడిచివెళ్లడానికి అంగీకరించడంతో వారిని ఫ్రాన్స్‌కు పంపించామని ఇజ్రాయెల్‌లోని లీగల్ రైట్స్ గ్రూప్ అదాలా పేర్కొంది. ఇతర కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరించడంతో వారిని నిర్బంధంలో ఉంచి..అధికారులు విచారిస్తున్నారని తెలిపింది,గ్రెటాను ఫ్రాన్స్‌కు పంపిస్తున్నామని, అక్కడి నుంచి స్వీడన్‌కు వెళ్తుందని పేర్కొంటూ..ఇజ్రాయెల్ విదేశాంగశాఖ ఆమె ఫొటోను ఎక్స్‌లో పోస్టు చేసింది.
గాజా పౌరుల కోసం ఆహారం, బేబీ ఫార్ములా తీసుకుని గ్రెటా థన్‌బర్గ్, మెంబర్ ఆఫ్ యూరోపియన్ పార్లమెంట్ రీమా హసన్‌తో పాటు మొత్తం 12 మంది జూన్ 6న సిసిలీ ప్రాంతం నుంచి ఓ నౌకలో బయల్దేరారు. సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఆర్మీ అంత్జాతీయ జలాల్లో వీరిని అడ్డుకుంది. అనంతరం నౌకను ఇజ్రాయెల్ పోర్టుకు మళ్లించాయి. గాజా నలువైపులా ఆంక్షలు ఉండటంతో వీరి నౌకను అదుపులోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. అయితే అది సాయం అందించడం కోసం వస్తోన్న నౌక కాదని, కేవలం సెలబ్రిటీల ‘సెల్ఫీ’ యాత్ర అని ఇజ్రాయెల్ విదేశీ మంత్రిత్వ శాఖ ఆరోపించింది.
గాజాకు మానవతాసాయం అందించేందుకు వెళుతున్న మేడ్లిన్ నౌకను అంతర్జాతీయ జలాల్లో అడ్డుకున్న ఇజ్రాయెలీ సైన్యం.. అందులో ఉన్న పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ను (Donald Trump- Greta Thunberg) కూడా అదుపులోకి తీసుకుంది. దాంతో తమను ఇజ్రాయెల్ దళాలు కిడ్నాప్ చేశాయంటూ గ్రెటా థన్‌బర్గ్ ఆరోపించారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
‘‘ఆమె ఒక వింత మనిషి. చిన్న పిల్ల. ఆమె కోపం నిజమైందో, కాదో కూడా తెలియదు. ఆమెకు కోపం తగ్గాలంటే ప్రత్యేక తరగతులకు వెళ్లాలని సూచిస్తున్నాను. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యానికి చాలా సమస్యలు ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు.
పాలస్తీనా అనుకూల ఫ్రీడమ్ ఫ్లొటిల్లా అలెయన్స్ అనే సంస్థ చేపట్టిన మిషన్‌లో భాగంగా బ్రిటిష్ జెండాతో ఉన్న మద్లీన్ నౌకలో గ్రెటా థన్‌బర్గ్, మెంబర్ ఆఫ్ యూరోపియన్ పార్లమెంట్ రీమా హసన్‌తో పాటు మొత్తం 12 మంది ప్రయాణించారు. వీరంతా గాజా పౌరుల కోసం ఆహారం, బేబీ ఫార్ములా తీసుకొని జూన్ 6న సిసిలీ ప్రాంతం నుంచి బయల్దేరారు. వీరు గాజాను చేరుకోవడానికి ముందే.. సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఆర్మీ అంతర్జాతీయ జలాల్లో వీరి నౌకను అడ్డుకుంది.