Saudi Oil Refinery: సౌదీ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ భీకర దాడి!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ చేస్తున్న దాడులతో మిడిల్ ఈస్ట్ ప్రాంతం అట్టుడుకుతోంది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ (Saudi Oil Refinery) అయిన సౌదీ అరేబియాకు చెందిన ‘ఆరామ్కో’ (Saudi Aramco) చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడటం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
రిఫైనరీపై విరుచుకుపడ్డ డ్రోన్లు..
సౌదీ అరేబియాలోని అత్యంత కీలకమైన ‘రాస్ తనురా’ (Ras Tanura) చమురు శుద్ధి కేంద్రం (Saudi Oil Refinery) లక్ష్యంగా ఇరాన్ తన ప్రమాదకరమైన ‘షాహెద్-136’ (Shahed-136) డ్రోన్లతో విరుచుకుపడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేశాయి. ఈ ఆకస్మిక దాడితో రిఫైనరీ ప్రాంగణంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆకాశాన్ని తాకుతున్న మంటలు, దట్టమైన పొగకు సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ చమురు శుద్ధి కేంద్రాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి

(adsbygoogle = window.adsbygoogle || []).push({});
చమురు ధరలకు రెక్కలు..
ఒకవైపు యుద్ధ వాతావరణం, మరోవైపు ఇరాన్ తీసుకుంటున్న వ్యూహాత్మక చర్యలతో (Saudi Oil Refinery) అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) గుండా వాణిజ్య నౌకల రాకపోకలను ఇరాన్ దిగ్బంధించడంతో ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు 10 శాతం మేర పెరిగాయి. తత్ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 80 డాలర్ల మార్కును దాటేసింది. తాజాగా సౌదీ ఆరామ్కోపై (Saudi Oil Refinery) జరిగిన దాడితో గ్లోబల్ ఆయిల్ సప్లై చెయిన్ దెబ్బతిని, ఈ ధరలు మరింత రికార్డు స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దద్దరిల్లుతున్న పేలుళ్లతో గల్ఫ్ దేశాలు..
పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ సైనిక, దౌత్య స్థావరాలే ప్రధాన లక్ష్యంగా టెహ్రాన్ తన ప్రతీకార దాడులను (Saudi Oil Refinery) నిరంతరాయంగా కొనసాగిస్తోంది. తాజాగా కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు దుబాయ్, దోహా, అబుధాబి, జెరూసలెం వంటి కీలక నగరాల్లోనూ భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో గల్ఫ్ దేశాలు, అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనల నడుమ కాలం గడుపుతున్నారు.
ఇవి కూడా చదవండి

















