Donald Trump: ఖమేనీ మరణంతో చర్చలకు ఇరాన్: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం, ఆ దేశంపై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ తాజా పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం తమతో శాంతి చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపిస్తోందని ఆయన వెల్లడించారు. ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ పలు కీలక విషయాలను పంచుకున్నారు.
చర్చలకు మేం సిద్ధం..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానంతరం ఆ దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. ఇన్నాళ్లూ అమెరికాతో ద్వైపాక్షిక చర్చలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న అగ్ర నేతలందరూ ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని ఆయన స్పష్టం చేశారు. “ఇరాన్ నాయకత్వం మాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం పంపింది. వారి ప్రతిపాదనకు నేను కూడా సానుకూలంగా స్పందించాను. కానీ ఈ నిర్ణయం వారు ముందుగానే తీసుకుని ఉంటే ఇంతటి భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగి ఉండేది కాదు” అని ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఖమేనీ మరణవార్త తెలుసుకుని ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారని, త్వరలోనే అక్కడ ఒక ప్రజానుకూలమైన కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
నావికాదళం లక్ష్యంగా భీకర దాడులు..
తాజా మిలిటరీ ఆపరేషన్‌లో ఇరాన్‌కు వాటిల్లిన నష్టాన్ని ట్రంప్ (Donald Trump) సవివరంగా వెల్లడించారు. గత రెండు రోజులుగా జరిగిన భీకర దాడుల్లో ఇరాన్ నావికాదళం పూర్తిగా కుదేలైందని ఆయన ప్రకటించారు. ఇరాన్‌కు చెందిన అత్యంత కీలకమైన 9 యుద్ధ నౌకలను అమెరికా దళాలు సముద్రంలోనే కుప్పకూల్చాయి. ఇరాన్ నేవీ ప్రధాన కార్యాలయాన్ని (హెడ్‌క్వార్టర్స్) దాదాపుగా నేలమట్టం చేశామని ట్రంప్ చెప్పారు. “మిగిలి ఉన్న ఇతర నావికాదళ స్థావరాలను, యుద్ధ నౌకలను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ దాడుల్లో ఇరాన్ ప్రభుత్వ, సైనిక విభాగాలకు చెందిన సుమారు 48 మంది అత్యున్నత స్థాయి నేతలు హతమయ్యారని ఆయన (Donald Trump) ధ్రువీకరించారు.
![]()
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నిప్పుల వర్షం కురిపించిన అమెరికా, ఇజ్రాయెల్..
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు అక్షరాలా నిప్పుల వర్షం కురిపించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సంయుక్త ఆపరేషన్‌లో ఇరు దేశాలు కనీవినీ ఎరుగని రీతిలో దాడులకు తెగబడ్డాయి. అమెరికా సైన్యం కేవలం 12 గంటల వ్యవధిలోనే ఇరాన్ స్థావరాలపై ఏకంగా 900కు పైగా అత్యధునిక మిసైల్స్‌ను ప్రయోగించి విరుచుకుపడింది. మరోవైపు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) కూడా 24 గంటల వ్యవధిలో ఏకంగా 1200 క్షిపణులతో ఇరాన్‌పై వినాశనం సృష్టించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ దాడులతో ఇరాన్ అణు, సైనిక సామర్థ్యం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి

















