Canada : భారతీయ విద్యార్థులకు పర్మిట్లలో కెనడా భారీ కోత
కెనడా (Canada )లో విద్యాభాస్యం చేయాలనుకొనే విద్యార్థులకు ఇప్పుడు భారీగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ దేశం భారతీయ విద్యార్థుల (Indian students) కు ఇచ్చే స్టడీ పర్మిట్ల (Study permits)లో దాదాపు 31 శాతం కోత విధించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన ఇమిగ్రేషన్ (Immigration) , రెప్యూజీ అండ్ సిటిజన్షిప్ కెనడా (ఐఆర్సీసీ) రికార్డులు వెల్లడిస్తున్నాయి. 2025 తొలి త్రైమాసికంలో కేవలం 30,640 పర్మిట్లు మాత్రమే జారీ చేశారు. గతంలో పోల్చితే ఇది 31 శాతం తక్కువే. 2024 ఇదే సీజిన్లో దాదాపు 44,295 మంజూరు చేశారు. కెనడాలో 2023 నుంచి అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్న నిర్ణయానికి అనుగుణంగా తీసుకొంటున్న చర్యల ఫలితంగానే ఈ పరిస్థితి ఏర్పడిరది.







