Australia: ఆస్ట్రేలియాలో జార్జి ఫ్లాయిడ్ తరహా ఘటన
ఆస్ట్రేలియా పోలీసుల కర్కశ చర్య కారణంగా భారత సంతతి వ్యక్తి ఒకరు మెదడు దెబ్బ తిని కోమాలోకి వెళ్లారు. 2020లో యూఎస్‌లో పోలీసుల చేతిలో హత్యకు గురైన జార్డ్ ఫ్లాయిడ్ (Jared Floyd) ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది. బాధితుడు గౌరవ్ కుండిని ( 42) అడిలైడ్ తూర్పు శివార్లలో పోలీసులు రోడ్డు పై బలవంతంగా తీసుకెళ్లారు. అదే సమయంలో ఆయన భార్య అమృత్‌పాల్ కౌర్ (Amritpal Kaur) తన భర్త అమాయకుడని పోలీసులకు విన్నవించారు. నేను ఏ తప్పు చేయలేదు అని గౌరవ్ బిగ్గరగా అరిచారు. పోలీసులు (Police) అన్యాయంగా ప్రవర్తించారని కౌర్ ఆరోపించారు. గౌరవ్‌ను పోలీసులు నేలకేసి కొట్టడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. తన భర్తను కిందపడేసి, మెడపై మోకాలితో తొక్కిపెట్టారని కౌర్ ఆరోపించారు. ప్రస్తుతం ఐసీయూ (ICU)లో చికిత్స పొందుతున్న గౌరవ్ పరిస్థితి విషమంగా ఉంది. అతడిని అరెస్ట్ చేయాలని ప్రయత్నించినప్పుడు అతడు హింసాత్మకంగా ప్రతిఘటించాడని పోలీసులు ఆరోపించారు.







