సత్యదీప్ గుప్తా ప్రపంచ రికార్డు.. ఒకే సీజన్ లో రెండుసార్లు
భారత పర్వతారోహకుడు సత్యదీప్ గుప్తా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఎవరెస్టు, లోత్సీ పర్వతాలను ఒకే సీజన్లో అధిరోహించడంతో పాటు కేవలం 11 గంటల 15 నిమిషాల వ్యవధిలోనే ఆ యాత్రను పూర్తి చేయడం విశేషం. ప్రపంచంలోనే ఎత్తయిన 8,516 మీటర్ల ఎవరెస్టును సోమవారం మధ్యాహ్నం, నాలుగో ఎత్తయిన 8849 మీటర్ల లోత్సీ శిఖరాన్ని అదే రోజు అర్థరాత్రి వరకు చుట్టేశారు. ఒకే సీజన్లో ఇలా రెండు ఘనతలు సాధించిన వ్యక్తిగా గుప్తా ప్రపంచ రికార్డు సృష్టించినట్లు అడ్వైంచర్ సంస్థ ప్రతినిధులు వెల్లడిరచారు.






