America: అమెరికాలో కొత్త కాన్సులర్ కేంద్రాలను ప్రారంభించిన భారత్

అమెరికా వ్యాప్తంగా 8 కొత్త కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లను భారత ప్రభుత్వం ప్రారంభించింది. అమెరికాలోని భారత రాయబారి వినయ్ ఖ్వాత్రా (Vinay Khwatra) ఈ విషయాన్ని ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి యూఎస్‌ఏ లో మా కాన్సులర్ సేవలను విస్తరిస్తున్నాం. బోస్టన్, కొలంబస్, డాలస్, డెట్రాయిట్ (Detroit) , ఆడిసన్, ఓర్లాండో, రాలీ, శాన్‌జోస్‌లో ఈ కొత్త కేంద్రాలు ఉంటాయి. త్వరలో లాస్ ఏంజలెస్ (Los Angeles) లోను మరో కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాం. వీటితో భారతీయ డయాస్సోరాకు కాన్సులర్ సేవలు గణనీయంగా పెరుగుతాయి అని తెలిపారు. ఈ సెంటర్లు శనివారాల్లో కూడా తెరిచి ఉంటాయి. భారత సంతతికి చెందిన దాదాపు 54 లక్షల మంది అమెరికాలో నివసిస్తున్నారు.