India : భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై .. త్వరగా
భారత్, అమెరికా (India-America )ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరుదేశాలు చర్చలను ముమ్మరం చేశాయి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ (Howard Lutnick) తో సమావేశమయ్యారు. మొదటి దశ ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేసే దిశగా తమ మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగాయని తెలిపారు. మంత్రుల స్థాయి సమవేశాల అనంతరం రెండు దేశాల ప్రధాన సంధానకర్తల మధ్య చర్చలు ఈనెల 22 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు నాటికి తొలి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా పరస్పర మార్కెట్ల వినియోగం, స్థానిక నిబంధనల అమలు, టారిఫ్ (Tariff) మినహాయింపులకు పరిమితులపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.







