ఉక్రెయిన్ డిక్లరేషన్ కు … భారత్ దూరం
ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనడంపై జరిగిన చర్చల అనంతరం తుది ప్రకటనపై భారత్ సహా 7 దేశాలు సంతకాలు చేయలేదు. భారత్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మెక్సికో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ప్రకటనపై సంతకాలు చేయలేదని స్విట్జర్లాండ్ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ చర్చల్లో సుమారు 90 దేశాలు పాల్గొన్నాయని చెప్పింది. ఈ సదస్సుకు హాజరైన దేశాల్లో అబ్జర్వర్‌గా పేర్కొనబడిన బ్రెజిల్ కూడా తుది ప్రకటనపై సంతకం చేయలేదు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతే ప్రాతిపదిక కావాలని సదస్సులో పాల్గొన్న దేశాలు పిలుపునిచ్చాయి.






