Randhir Jaiswal: ట్రంప్ ప్రకటనల్లో ఏమాత్రం వాస్తవం లేదు : రణధీర్ జైస్వాల్
భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్దాన్ని ఆపేశానని, తాను చొరవ తీసుకోకపోయి ఉంటే రెండు దేశాల మధ్య కచ్చితంగా అణుయుద్ధం జరిగేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) తిప్పికొట్టారు. మాట వినికపోతే టారిఫ్‌లు(Tariffs) విధిస్తామని, వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటామని బెదిరించడంతో భారత్, పాక్‌లు దారికొచ్చాయని, బుద్ధిగా కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ చెప్పడాన్ని ఖండిరచారు. పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో అమెరికాలో జరిగిన చర్చల్లో టారిఫ్‌ల అంశమే ప్రస్తావనకు రాలేదని తేల్చిచెప్పారు. గత నెల 7 నుంచి 10వ తేదీ దాకా అమెరికాలో పలుమార్లు సంప్రదింపులు జరిగాయని అన్నారు. పాకిస్తాన్ (Pakistan) తో నెలకొన్న ఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితుల గురించి మాత్రమేని మాట్లాడామని తెలిపారు. టారిఫ్‌లు, వాణిజ్య సంబంధాల అంశాన్ని అమెరికా లేవనెత్త లేదని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటనల్లో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొన్నారు.







