F-35: ఎఫ్-35 కొనుగోలు ఒప్పందానికి భారత్ బ్రేకులు!
                                    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యంతో ఎఫ్-35 (F-35) యుద్ధ విమానాలు సహా రక్షణ రంగ ఒప్పందాల ఆమోదం విషయంలో భారత్ ముందుకు వెళ్లాలనుకోవడం లేదని తెలిసింది. అమెరికా (America)తో వాణిజ్య చర్చలు కొనసాగించాలని భారత్ కోరుకొం టోందని అగ్రరాజ్యం నుంచి కొనుగోళ్లను పెంచే మార్గాలను అన్వేషిస్తోందని తెలిసింది. సహజవాయువు కొనుగోళ్లను, కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం దిగుమతులను పెంచే అంశాన్ని పరిశీలిస్తోందని, అయితే కొత్త రక్షణ ఒప్పందాలను నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం ఆమోదించే అవకాశం లేదని పేర్కొంది. ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోలుపై ఆసక్తి లేదని అమెరికా అధికారులకు భారత్ చెప్పినట్లు తెలిసింది.







