Pakistan: దాయాదికి మరో షాక్ … పాక్ ఎయిర్లైన్లకు
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తమపై ఆంక్షలు విధించిందనే అక్కసుతో భారత్‌పై పాకిస్థాన్ (Pakistan) విషం చిమ్మింది. తమ గగనతలంపై మన దేశాల విమానాల (Airplanes) రాకపోకలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో న్యూఢల్లీి కూడా దీనిపై ప్రతీకార చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాక్ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక, పాకిస్థానీ నౌకలు కూడా భారత పోర్టు (Indian port) లోకి రాకుండా నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలన దశలో ఉంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి వెల్లడిరచినట్లు సమాచారం. ఒకవేళ దీనిపై భారత్ నిర్ణయం తీసుకుంటే, అది పాక్ ఎయిర్లైన్ల (Pak Airlines) పై పెను ప్రభావం చూపించే అవకావశం ఉంది.







