G7 Summit: జీ7 సదస్సుకు హాజరుకానున్న మోదీ
కెనడాలో జరగనున్న జీ7 శిఖరాగ్ర సదస్సు (G7 Summit ) కు తాను హాజరు కానున్నట్టు ప్రధాని మోదీ (Modi) ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney)ని కలవాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సిందిగా స్వయంగా ఆహ్వానం పంపినందుకు ఆయన కెనడా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా ఎన్నికైనందు కు అభినందనలు (Congratulations) తెలుపుతున్నాను. కెనడాలోని కననాస్కిస్ లో ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనున్న జీ7 శిఖరాగ్ర సదస్సుకు నన్ను ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు అని మోదీ పేర్కొన్నారు.







