Britain : అమెరికా బాటలోనే బ్రిటన్ …భారత్‌కు పంపిస్తుండగా
అక్రమ వలసదారుల విషయంలో అమెరికా (America) బాటలోనే బ్రిటన్ ప్రభుత్వం (British Government) నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు అక్రమ వలసదారులను భారత్(India)కు పంపిస్తుండగా, అందులో ఒక వ్యక్తి అధికారుల నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. హీత్రూ విమానాశ్రయంలోని టెర్నినల్ 2 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. యూకే అధికారులు అక్రమ వలదారులను భారత్‌కు పంపిస్తున్నారు. వారిలో ఓ వ్యక్తి అధికారుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అతడు రన్‌వేపై పరుగులు తీశాడు. ఎయిర్‌పోర్టు సిబ్బంది (Airport staff), పోలీసులు (police) వెంటనే అప్రమత్తమై అతడిని బంధించారు. అనంతరం అతడిని విమానం ఎక్కించారు.







