America: యెమెన్ పై మళ్లీ అమెరికా దాడులు
యెమెన్ జైలుపై అమెరికా (America) జరిపిన వైమానిక దాడిలో 68 మంది మరణించగా 47 మంది గాయపడ్డారు. యెమెన్ (Yemen)లోని సాదా రాష్ట్రంలో అమెరికా వైమానిక దాడులు చేసిందని హౌతీ (Houthi) తిరుగుబాటుదారులు ఆరోపించారు. ఆఫ్రికన్ (African) వలసదారులు ఉన్న జైలులో ఈ దాడులు జరిగాయన్నారు. ఇందులో 68 మంది మృతి చెందగా 47 మంది గాయపడ్డారని వెల్లడిరచారు. ఈ జైలులో 115 మంది ఖైదీలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. యెమెన్ రాజధాని సనా (Sana)లో కూడా అమెరికా వైమానిక దాడులు జరిపిందని, ఈ దాడుల్లో ఎనిమిది మంది మరణించారని హౌతీలు తెలిపారు.







