భారత్, అమెరికా బంధం.. ప్రపంచంలోనే

భారత్, అమెరికా మధ్య ఉన్న బంధం ప్రపంచంలోనే ఒక ముఖ్యమైనదని, ఇది అనేక సంవత్సరాలుగా కొనసాగుతోందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్ పేర్కొన్నారు. అమెరికాలో జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జయశంకర్ తొలిసారిగా ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన హెచ్‍ఆర్ మెక్‍మాస్టర్‍తో వెబ్‍కాస్ట్ ద్వారా జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. అమెరికా సంబంధాల కొనసాగింపునకు తమ వద్ద పెద్ద అజెండా ఉందని జయశంకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సంబంధాల బలోపేతానికి ఇరుదేశాలు కృషి చేశాయని అన్నారు. నేటి ప్రపంచంలో దేశాలు పరస్పరం సహకరించుకోవడం ప్రస్తుం సవాల్‍గా ఉందని అన్నారు. ఈ విషయంలో అమెరికా మనస్తత్వంలో తాను పెద్ద మార్పును చూస్తున్నానని తెలిపారు.