Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం .. 5 రాష్ట్రాల్లో

రూ.3,500 కోట్ల విలువైన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ (Liquor Scam) అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) , తమిళనాడు, కర్ణాటక (Karnataka), ఢల్లీిలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇప్పటి వరకూ 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్టు చేసింది. ధనుంజయరెడ్డి (ఏ-31), కృష్ణమోహన్ రెడ్డి (ఏ-32), బాలాజీ గోవిందప్ప (ఏ-33), పైలా దిలీప్ (ఏ-30)లు బెయిల్ పై బయటకు రాగా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskara Reddy) , వెంకటేశ్‌నాయుడు (Venkatesanand) సహా మొత్తం 8 మంది ఇంకా జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే.