America: అమెరికా ప్రయాణమా?.. లగేజీలో ఏడు రకాల వస్తువులపై నిషేధం!
విమానాల్లో ప్రమాదాల నివారణే లక్ష్యంగా అమెరికా (America) రవాణా భద్రతా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడంతో పాటు భద్రతా చర్యలను మరింత కట్టడి చేసేందుకు ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తో కలిసి కొత్త నియమాల్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అమెరికా విమానాల్లో చెక్ ఇన్ లగేజీలో లిథియం బ్యాటరీ (Lithium battery)తో నడిచే ఏడు రకాల వస్తువులపై నిషేధం విధించారు. ఇటీవల వాణిజ్య విమానాల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని క్యారీ ఆన్ లగేజీ (Carry-on luggage)లో తీసుకెళ్లే వెసులుబాటు ఉంది.
నిషేధం వీటిపైనే :
-పవర్ బ్యాంక్‌లు.
-సెలోఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ కేస్లు.
-స్పేర్ లిథియం-అయాన్ బ్యాటరీలు.
-స్పేర్ లిథియం- మెటల్ బ్యాటరీలు.
-సెల్‌ఫోన్ బ్యాటరీలు.
-ల్యాప్‌ట్యాప్ బ్యాటరీలు.
-ఎక్స్టర్నల్ బ్యాటరీ ప్యాక్‌లు, పోర్టబుల్ రీఛార్జులు.







