ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు.. వాళ్లో..మేమో తేల్చుకుంటాం
హమాస్ మిలిటెంట్లను రాక్షసులుగా అభివర్ణించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఆయన హమాస్ దాడిలో అక్టోబరు 7న మృతి చెందిన ఇజ్రాయెలీల స్మారకార్థం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మేం హమాస్ చెరలోని బందీలను ఒక్క సెకను కూడా మరిచిపోం. బందీలందరినీ ఇంటికి తెస్తాం. వారి ఉగ్రవాదం అంతమయ్యేవరకు నిద్రపోం. వాళ్లో మేమో తెల్చుకుంటాం. అని అక్టోబర్ 7 దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ నిర్మూలిస్తాం. మళ్లీ ఆయుధాలు పట్టకుండా వారి చేతులను నరికేస్తాం అని పేర్కొన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్దేదే లేదని స్పష్టం చేశారు.






