Gujarat Family: చలికి గడ్డకటి భారతీయ ఫ్యామిలీ మృతి.. కేసులో కీలక పరిణామం
కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ చలికి గడ్డ కటి గుజరాత్ (Gujarat) కు చెందిన ఓ కుటుంబం మృతి చెందిన కేసులో ఇద్దరికి అమెరికా న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. భారత్ నుంచి పలువురుని స్టూడెంట్ వీసా (Student visa )పై కెనడాకు రప్పించి, అక్కడి నుంచి అమెరికాకు అక్రమ మార్గంలో తరలిస్తున్న ఈ ముఠా గుట్టురట్టయ్యింది. ఈ కేసులో భారత్‌కు చెందిన స్మగ్లర్ డర్టీ హ్యారీ అని పిలువబడే హర్షకుమార్ రమణ్‌లాల్ (Harsha Kumar Ramanlal) పటేల్‌కు పదేండ్ల జైలు శిక్ష, ఆయన సహచరుడు ఫ్లోరిడాకు చెందిన స్టీవ్ ఆంటోనీ షాంద్ (Steve Anthony Shand) కు ఆరేండ్ల శిక్షను ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2021లో కెనడా (Canada) నుంచి అమెరికాకు వెళ్తుండగా గుజరాత్‌కు చెందిన జగదీశ్ పటేల్ (Jagdish Patel), వైశాలిబెన్, విహంగి, ధార్మిక్ చలికి తాళలేక మృతిచెందారు.







