పృథ్వీ షా ద్రావిడ్ దగ్గరకు వెళ్ళు, క్రికెట్ అభిమానుల సూచన…
జాతీయ జట్టుకు ప్రాతినిధ్య ఊహించడం అనేది అంత సులువైన విషయం కాదు. 140 కోట్ల మంది భారతీయుల్లో ఎందరో యువకులు భారత క్రికెట్ జట్టు తరుపున జాతీయ జట్టులో ఆడేందుకు నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఆస్తుల అమ్ముకుని క్రికెట్ శిక్షణకు వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తీవ్ర స్థాయిలో కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది యువ ఆటగాళ్లు మాత్రం వచ్చిన అవకాశాన్ని కాలితో తన్నుకోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అందులో భారత జట్టు యువ ఆటగాడు పృథ్వి షా ముందు వరుసలో ఉంటాడు.
అతి చిన్న వయసులో పాపులర్ అయిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు కెరీర్ పై ఫోకస్ పెట్టకుండా క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడం క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే జాతీయ జట్టుకు ఆడి సెంచరీ చేసిన పృథ్వి షా ఇప్పుడు ఫామ్ కోల్పోవడమే కాకుండా బరువు పెరిగిపోవడం… అలాగే ఫిట్నెస్ కోల్పోవడం క్రికెట్ అభిమానులను ఆందోళన గురిచేస్తుంది. మరో సచిన్ అవుతాడు అనుకున్న పృద్విషా ఇప్పుడు కెరీర్ పై ఫోకస్ పెట్టకపోవడంతో అతన్ని ఐపిఎల్ మెగా ఆక్షన్ లో కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు.
గత కొన్నాళ్లుగా ఫామ్ లేక సతమతమవుతున్న పృద్విషాను ముంబై రంజీ జట్టు నుంచి కూడా తప్పించారు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా పృద్విష అంత గొప్పగా ఏమి రాణించటం లేదు. దీనితో అతని కెరీర్ పై నీలి నీడలకు కమ్ముకున్నాయి. తల్లి మరణం తర్వాత తండ్రి ఎన్నో కష్టాలు పడి పృద్విషాను ఆ స్థాయికి తీసుకొస్తే అతను క్రమశిక్షణ కోల్పోయి ఇప్పుడు ఇబ్బందులు పడటానికి క్రికెట్ అభిమానులు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీనితో సీనియర్ ఆటగాళ్లు సైతం పృథ్వి షాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎందరో ఆటగాళ్లు భారత జట్టులోకి రావాలని కలలు కంటూ… నానా కష్టాలు పడుతుంటే వచ్చిన అవకాశాన్ని కాలితో తన్నుకోవడం ఏమాత్రం సబబు కాదంటూ ఈ యువ ఆటగాడికి సూచనలు ఇస్తున్నారు. ఇక పృద్విషాను టీమిండియా మాజీ హెడ్ కోచ్ ద్రావిడ్ వద్దకు శిక్షణకు పంపితే మంచి ఫలితాలు ఉంటాయని… అతనికి క్రమశిక్షణ అలాగే ఫిట్నెస్ తిరిగి తీసుకురావడం ద్రావిడ్ వల్లనే సాధ్యమవుతుందని పలువురు సూచిస్తున్నారు. ఐపీఎల్ వేలంలో పృద్విషా అమ్ముడు కాకపోయినా పెద్దగా నష్టం లేదని కెరీర్ పై ఫోకస్ పెడితే కచ్చితంగా అతనికున్న ప్రతిభకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని అభిప్రాయ పడుతున్నారు.
ద్రావిడ్ లేదా వివిఎస్ లక్ష్మణ్ అకాడమీలో అతను తిరిగి జాయిన్ అయితే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. ముంబై జట్టు నుంచి ఎందరో ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికైన పెద్దగా గుర్తింపు సంపాదించలేదు. అలాంటిది ముంబై జట్టు నుంచి వచ్చి జాతీయ జట్టులోకి అడుగుపెట్టి తొలి మ్యాచ్ తోనే సెంచరీ బారిన పృద్విషా తన కెరీర్ ని తానే స్వయంగా నాశనం చేసుకోవడం చూసి అతని తండ్రి కూడా మధనపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియా కు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తర్వాత ఆ స్థాయి ఆటతీరు పృద్విషాలో కనపడిందని ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు ఎందరో అతని తొలి సెంచరీ చూసి వ్యాఖ్యలు చేశారు. కానీ పృథ్విష మాత్రం తన కెరీర్ పై ఏ విధంగా కూడా ఫోకస్ పెట్టకుండా చేజేతులారా నాశనం చేసుకుంటున్నాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంలో బీసీసీ జోక్యం చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. అతని తరువాత జాతీయ జట్టులో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ వంటి ఆటగాళ్లు తమ ప్రదర్శన మెరుగుపరుచుకోవడానికి నిత్యం శ్రమిస్తుంటే పృద్విషా మాత్రం కెరీర్ను నాశనం చేసుకోవడం క్రికెట్ అభిమానులను మనోవేదనకు గురిచేస్తోంది.






