India: మరిన్ని వర్క్ వీసాలు ఇవ్వండి … బ్రిటన్ కోరిన భారత్
ఐటీ, ఆరోగ్య రంగాల నిపుణులకు మరిన్ని వర్క్ వీసా (Visa )లు మంజూరు చేయాలని భారత(India) ప్రభుత్వం బ్రిటన్ (Britain) ను కోరింది. బ్రిటన్‌తో జరుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య చర్చల సందర్భంగా భారత ప్రతినిధులు ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. ప్రస్తుతం భారత్ ప్రతి ఏటా వంద అదనపు వర్క్ వీసాలు (Work visas) మాత్రమే పొందుతోంది. ఈ సంఖ్యను పెంచాలని కేంద్రం ఎప్పటి నుంచో బ్రిటన్ను కోరుతోంది. రెండు రోజుల బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయుష్ గోయల్ (Piyush Goyal ) లండన్ లో ఆ దేశ వాణిజ్య మంత్రి జొనాథన్ రేనాల్డ్స్ (Jonathan Reynolds) తో సమావేశమయ్యారు. రేనాల్డ్స్‌తో సమావేశం అనంతరం గోయల్ మాట్లాడుతూ వాణిజ్య మంత్రితో ఫలప్రదమైన సమావేశం జరిగింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను మరింత ముందుకు తీసుకుపోవాలని, రెండు దేశాల ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అభిప్రాయపడ్డాం అని తెలిపారు. ప్రధానంగా వీసా రాయితీలే భారత్‌కు ఎదురు దెబ్బగా భావించవచ్చు. తమ దేశానికి చెందిన నిపుణులైన ఉద్యోగులకు మరిన్ని బ్రిటన్ వీసాలు మంజూరు చేయాలని భారత్ కోరుతోంది.







