Pakistan: అమెరికాలో నకిలీ వీసా రాకెట్ గుట్టురట్టు.. ఇద్దరు పాకిస్థానీయుల అరెస్టు
అమెరికాలో నకిలీ ధ్రువీకరణ పత్రాలతో అక్రమంగా వీసాలు పొందుతున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది. ఇలా అక్రమంగా పొందిన వీసాలను విదేశీయులకు విక్రయించి డబ్బు సంపాదిస్తున్న ఇద్దరు పాకిస్థాన్ జాతీయుల ను ఎఫ్‌బీఐ అధికారులు (FBI officials) అదుపులోకి తీసుకొన్నారు. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పేటల్ వెల్లడిరచారు. టెక్సాస్‌లో పాకిస్థాన్ (Pakistan) కు చెందిన అబ్దుల్ హది ముర్షిద్ (Abdul Hadi Murshid), మహమ్మద్ సల్మాన్ (Mohammed Salman )లను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరు ఉద్యోగాలు సృష్టించినట్లు నకిలీ పాత్రలు సమర్పించి అక్రమంగా వీసాలు పొంది, వాటిని విదేశీయులకు పెద్ద మొత్తంలో అమ్ముకునే వారు. ఇందులో ఈబీ-2, ఈబీ-3, హెచ్1 బీ వీసా ప్రోగ్రామ్‌లను ఉపయోగించేవారు. అమెరికన్లకే ఉద్యోగాలు ఇస్తున్నట్లు లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లున్న నకిలీ ఉద్యోగ ప్రకటనలను పత్రికల్లో పబ్లిక్ చేయిస్తుంది. ఒక్కసారి అక్కడి నుంచి అనుమతులు వచ్చిన తర్వాత, వారు వీసా కోరుకుంటున్న వారి కోసం గ్రీన్‌కార్డు (Green card) లను మంజూరు చేయాలని అమెరికా ఇమిగ్రేషన్ విభాగాన్ని అభ్యర్థిస్తారు. వీరి గుట్టు కాస్త బయటపడటంతో ఎఫ్‌బీఐ అధికారులకు చిక్కారు. వీరు దోషులుగా తేలితే దాదాపు 20 ఏళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.







