అమెరికాలో మళ్లీ కాల్పుల మోత…

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్ రైల్వే యార్డ్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్టు శాంటాక్లారా కౌంటీ అధికార ప్రతినిది ఒకరు తెలిపారు. కాల్పులకు పాల్పడిన అనుమానితుడు కూడా మృతి చెందాడని చెప్పారు. బాధితుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అనుమానితుడు ఎలా చనిపోయాడు అన్నది ఇంకా నిర్ధారించలేదని మరో అధికార ప్రతినిధి డిప్యూటీ రసెల్ డేవిస్ తెలిపారు.