K-Ramp: మరో 30 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న కొత్త సినిమా “K-ర్యాంప్” రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. ప్రేక్షకులకు హెవీ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు మరో 30 రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “K-ర్యాంప్” మూవీ 30 డేస్ కౌంట్ డౌన్ బిగిన్ చేసిన సందర్భంగా సినిమా మేకింగ్ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఆన్ లొకేషన్ లో ఎంత ఫన్ ఉందో ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. టీమ్ ఎంజాయ్ చేసిన ఇదే ఫన్ ను థియేటర్స్ లో ప్రేక్షకులకూ “K-ర్యాంప్” అందించబోతోంది.
“K-ర్యాంప్” సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. “K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.