దుబాయ్ యువరాణి సంచలన ప్రకటన!
దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భర్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ దంపతులకు తొలి సంతానం కలిగిన రెండు నెలలకే ఈ ప్రకటన రావడం గమనార్హం. అయితే, ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రియమైన భర్తకు మీరు ఇతరుల సహచర్యం కోరుకున్నందున మీతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నా. ఐ డైవర్స్ యూ టేక్ కేర్ మీ మాజీ భార్య అని షైకా మహ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో దంపతులిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, వారి కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారని కొందరు, షైకా మహ్రా అకౌంట్ హ్యాక్ అయ్యిందని మరికొందరు చర్చించుకుంటున్నారు. పలువురు నెటిజన్లు మాత్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని మహ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.






