FDA : ఎఫ్‌డీఏ నుంచి వైదొలిగిన భారత సంతతి శాస్త్రవేత్త

భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త ఆంకాలజిస్ట్ డాక్టర్ వినయ్ ప్రసాద్ (Vinay Prasad) ఎఫ్‌డీఏ నుంచి వైదొలిగారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రరేషన్ ( ఎఫ్‌డీఏ) వేక్సిన్ చీఫ్ అయిన వినయ్ సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ (సీబీఈఆర్) డైరెక్టర్‌గా నియమితులైన ఆయన మూడు నెలల్లోనే బయటికి వచ్చారు. డుచెన్ కండరాల బలహీనతకు జన్యు చికిత్సను ఇటీవల సారెప్టా థెరఫ్యూటిక్స్ (Therapeutics) ఆమోదించిన చికిత్సను వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు టీనేజర్లపై ప్రయోగించారు. వారిద్దరూ మరణించారు. ఇటీవలే జులై 18న మరో మరణం సంభవించింది. దీంతో ఆమోదించిన డీఎండీ (DMD)చికిత్సతోపాటు అన్ని సరుకులను నిలిపివేయాలని సారెప్టాను ఎఫ్‌డీఏ కోరింది. దీనికి భద్రతా సమస్యలు ఉన్నాయని పేర్కొంది. ప్రసాద్‌పై అనేక మంది విమర్శలు, ఆరోపణల చేశారు. ఈ నేపథ్యంలో వినయ్ ప్రసాద్ పదవి నుంచి వైదొలిగారు.