Dog :ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్క .. జస్ట్ రూ.50 కోట్లు!
బెంగళూరుకు చెందిన ప్రముఖ డాగ్ బ్రీడర్ ఎస్. సతీశ్ (S. Satish) మాత్రం జస్ట్ రూ.50 కోట్లేగా అని అనుకున్నారు. వెంటనే డబ్బులిచ్చేసి కొనేశారు. దీని పేరు చెప్పలేదు కదూ. ఒకామి (Okami) వినడానికి చైనా, జపానోళ్ల పేరులాదా ఉంది గానీ, ఇది పుట్టింది మాత్రం అమెరికా (America)లో. తోడేలు, కాకేన్ షెపర్డ్ జాతి కుక్క(Dog) క్రాస్ బ్రీడ్ (Crossbreed). ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైమట. అందుకే ఇంత రేటు అని చెబుతున్నారు. ఏదైతేనేం ఇప్పుడిది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్క. వయసు కేవలం 8 నెలలు బరువు మాత్రం ఇప్పటికే 75 కిలోలు ఉంది. అంటే ఒకామి మన మీద ఒక్కసారి పడిరదంటే కాలో చేయో విరగాల్సిందే.






