New Jersey: సరదాగా భోజనం కోసం వెళితే… బంపర్ లాటరీ
అమెరికాలోని న్యూజెర్సీ (New Jerseyకి చెందిన ఓ జంట సరదాగా రెస్టారెంటు (Restaurant) భోజనం కోసం వెళితే.. లాటరీ రూపంలో అదృష్టం వరించింది. రెస్టారెంటు దారిలో వీరు 3 డాలర్లకు ( సుమారు రూ.257) లాటరీ టికెటు (Lottery ticket) కొన్నారు. ఆ తర్వాత దాన్ని స్క్రాచ్ చేయగా ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.12.87 కోట్లు) లాటరీ తగిలింది. నిజానికి ఈ జంట అక్కడ లాటరీ టికెటు కొనేందుకు మొదట తటపటాయించారు. ఇద్దరూ చర్చించుకొని ఓ ప్రయత్నం చేసి చూద్దామని టికెటు కొని స్క్రాచ్ చేశారు. అయితే వారి ఆనందానికి అవధుల్లేవు. ఇది మా అదృష్టం. బిల్లులు కట్టలేక తీవ్ర ఒత్తిడికి గురయ్యేవాళ్లం. ఈ డబ్బుతో మా జీవితం సాఫీగా సాగిపోతుంది అని ఆ జంట హర్షం వ్యక్తం చేసింది.






