అమెరికా సైన్యంలో తొలిసారిగా… మహిళా అధికారి

అమెరికా సైన్యంలో తొలిసారిగా ఓ మహిళా కార్యదర్శి నియమితులయ్యారు. ఈ మేరకు క్రిస్టీన్ వోర్ముత్ నియామకాన్ని సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన అనంతరం అధికార మార్పిడి బృందానికి ఆమె నేతృత్వం వహించారు. ఆమెను సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ సాదరంగా ఆహ్వానించింది.